News October 7, 2025
అక్టోబర్ 8న పెద్దపల్లిలో జాబ్ మేళా: కలెక్టర్

పెద్దపల్లి టాస్క్ కేంద్రంలో oct8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. టెలిపెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్, కంటెంట్ మోడరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం ఎంపీడీవో కార్యాలయంలోని టాస్క్ కేంద్రానికి హాజరు కావాలన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించాలన్నారు.
Similar News
News October 7, 2025
పెదబయలు: సెల్ టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్

పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సెల్ టవర్ లేక పంచాయతీ పరిధి 23 గ్రామాల గిరిజనులు 2 వేల మంది ఈకేవైసీ, ఆధార్ అనుసందనం, ఉద్యోగులు ముఖ హాజరు కోసం పడరాని పాట్లు పడుతున్నారని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటుచేసి గిరిజనుల సెల్ సిగ్నల్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
News October 7, 2025
వరంగల్‌లో బాకీ కార్ట్ vs డోఖా కార్డ్

ఉమ్మడి వరంగల్‌లో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందంటూ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను BRS రిలీజ్ చేస్తే.. గత పదేళ్లలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ‘BRS కా డోఖా కార్డు’ను కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు. వరంగల్‌ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని BRSను కాంగ్రెస్ విమర్శిస్తే, అధికారం కోసం అమలు కాని హామీలిచ్చిందని కాంగ్రెస్‌ను BRS నాయకులు విమర్శిస్తున్నారు. మీ కామెంట్.
News October 7, 2025
జిల్లాలోనే అధిక పరిపాలనా విభాగాలు పర్చూరులోనే..!

పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ప్రత్యేకస్థానం సంపాదించింది. సాధారణంగా నియోజకవర్గానికి ఒక్కో ఉన్నతాధికారి ఉండడం సాధారణం. కానీ పర్చూరులో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా, వీటి పరిపాలనకు ఇద్దరు DSPలు, ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు RDOలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోనే అత్యధిక పరిపాలన వ్యవస్థగా ఉందని ప్రజలు అంటున్నారు.