News December 18, 2025

అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరిపై కేసు: కేశవపట్నం ఎస్ఐ

image

శంకరపట్నం మండలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్టివ్ నేషనల్ మెడికల్ మిషన్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కేశవపట్నం గ్రామంలో అంజయ్య, ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Similar News

News December 19, 2025

KNR: రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరి

image

కరీంనగర్ జిల్లాలోని రేషన్ కార్డుదారులు వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి సూచించారు. జిల్లాలో మొత్తం 3,17,748 రేషన్ కార్డుల్లో 9,45,605 మంది సభ్యులు ఉండగా, ఇప్పటివరకు 7,20,517 మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు వెంటనే సమీపంలోని చౌకధరల దుకాణాలకు వెళ్లి, ఈ-పాస్ యంత్రాల ద్వారా వేలిముద్రలు వేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.

News December 19, 2025

కరీంనగర్‌లో ఈనెల 24న కిసాన్ గ్రామీణ మేళా

image

డిసెంబర్ 24 నుంచి 26 వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ గ్రామీణ మేళా అధ్యక్షులు పి.సుగుణాకర్ రావు తెలిపారు. ఈ మేళాలో రైతులకు కొన్ని కంపెనీల విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రైతులకు తక్కువ ధరలో లభిస్తాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ ప్రదర్శన కార్యక్రమాలు ఉన్నందున జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News December 19, 2025

పంచాయితీ ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ భేష్‌

image

కరీంనగర్ జిల్లాలో మూడు దశల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, రాష్ట్రంలోనే ముందుగా పూర్తి చేసినందుకు కలెక్టర్ పమేలా సత్పతిని టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు కలిసి అభినందించారు. ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ కాళీచరణ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.