News October 18, 2025
అక్రమ టపాసులపై కఠిన చర్యలు: కర్నూలు ఎస్పీ

దీపావళి పండుగ వేళ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్‌లలో టపాసుల విక్రయాలు జరిగే ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిస్తే 112/100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News October 18, 2025
కామారెడ్డి: వరి కోత యంత్రాల యజమానులకు శిక్షణ

కామారెడ్డిలో వరి కోత యంత్రాల యజమానులకు శనివారం శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ నిర్వహించారు. వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోత ప్రారంభించాలని సూచించారు. యంత్రాలను 18 RPM వద్ద మాత్రమే నడపాలని, దీంతో గింజల నాణ్యత దెబ్బతినకుండా, తక్కువ తాలు గింజలు వస్తాయన్నారు. కోత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
News October 18, 2025
HYD: రెహమాన్‌పై మూడో కేసు నమోదు

జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న రెహమాన్‌పై <<17999949>>మరిన్ని కేసులు నమోదయ్యే<<>> అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బాలల సదనంలో గతంలో మరో బాలుడిపై అతడు లైంగిక దాడి చేసినట్లు సైదాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరో 10 మంది బాలలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోలీసులు మూడో కేసు నమోదు చేశారు.
News October 18, 2025
యార్డుల్లో ఇసుక సరఫరా పెంచాలి: కలెక్టర్

జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్టుగా యార్డుల్లో ఇసుకను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుండి ఇసుక రీచ్‌లలో త్రవ్వకాల పునరుద్ధరణ కార్యక్రమంపై సమీక్షించారు. స్టాక్ యార్డులలో ఉన్న ఇసుక వివరాలను గనుల శాఖ అధికారులు నిత్యం ఆన్‌లైన్‌లో పెట్టాలని సూచించారు.