News March 20, 2024
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై GHMC స్పెషల్ ఫోకస్..

HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై ప్రభుత్వ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నెక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ విల్లాలు, దుండిగల్ ఓ ఇంజినీరింగ్ కాలేజీ కూల్చివేత, బోడుప్పల్, ఘట్కేసర్, బండ్లగూడ జాగీర్, ఎల్బీనగర్, కీసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను ఇటీవల నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణం కనిపిస్తే కూల్చివేస్తామని GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.
Similar News
News September 5, 2025
ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండమే: ఆర్.కృష్ణయ్య

తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.
News September 5, 2025
పెరిగిన బిజినెస్.. GHMCకి భారీ ఆదాయం

మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇళ్లు, స్థలాలు ఈ సంవత్సరం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ అనుమతుల ద్వారా GHMCకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు GHMCకి రూ.399 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అవే నెలలకు సంబంధించి రూ.759.98 కోట్లు వచ్చింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
News September 5, 2025
HYD: ఈనెల 6న ట్రాఫిక్ ఆంక్షలు

గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా HYD నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 6న శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. బాలాపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వైపు సాగుతాయని, ఈ ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదన్నారు.