News January 26, 2025

అక్రమ రవాణాను అడ్డుకున్న గజపతినగరం పోలీసులు

image

గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో హైవేపై శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 19 పశువులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు తెలిపారు. రెండు లారీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. చిత్ర హింసలకు గురిచేస్తూ పశువులను తరలించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Similar News

News January 27, 2025

POLITICAL: విజయనగరం వైసీపీలో ఆయనే ‘కీ’లకం..!

image

ఉమ్మడి విజయనగరం YCPలో కీలక నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) VZM జడ్పీ ఛైర్మన్‌గా, జిల్లా వైసీపీ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేయడంలో శ్రీనివాసే ‘కీ’రోల్ పోషించారు. అయితే ఇప్పుడు అవంతి రాజీనామా తర్వాత భీమిలి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. మరి అక్కడ పార్టీని ఎలా నడిపిస్తారో చూడాలి.

News January 27, 2025

నారా లోకేశ్‌తో మంత్రి కొండపల్లి భేటీ

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌‌తో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. విశాఖ పర్యటనకు నారా లోకేష్ విచ్చేసిన సందర్బంగా విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. లోకేశ్‌ను కలిసిన వారిలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉన్నారు.

News January 26, 2025

VZM : కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎట్ హోం కార్యక్రమం

image

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబెడ్కర్ తన క్యాంపు కార్యాలయంలో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డా.అంబెడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు సత్కరించారు.కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తదితరులు ఉన్నారు.