News January 22, 2026

అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తం ఎప్పుడంటే?

image

2026లో వసంత పంచమి జనవరి 23, శుక్రవారం వచ్చింది. పంచమి తిథి శుక్రవారం తెల్లవారుజామున 2:28 గంటలకే ప్రారంభమవుతుంది. పూజకు, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఉదయం 7:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:33 గంటల వరకు అత్యంత శుభప్రదమైన సమయం. సూర్యోదయ తిథి ప్రాధాన్యత కలిగిన ఈ సమయంలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే చదువుల తల్లి దీవెనలతో పిల్లలు ఉన్నత విద్యావంతులుగా తయారవుతారని పండితులు సూచిస్తున్నారు.

Similar News

News February 21, 2026

VASTHU: ఏ అంతస్తులో ఎవరు ఉండాలి?

image

కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదాలను నివారించడంలో వాస్తుశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరించారు. అంతస్తులు గల భవనాలను సోదరులు ఏవిధంగా పంచుకోవాలో సూచించారు. ‘పై అంతస్తులో చిన్నవారు ఉండాలి. కింద పెద్దవారు నివసించాలి. సభ్యుల సంఖ్యను బట్టి ఈ క్రమాన్నే పాటించాలి. తద్వారా సోదరుల మధ్య ఐక్యత పెరుగుతుంది. మనస్పర్థలు రావు. కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 21, 2026

రాష్ట్రంలో 250 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ట్రాన్స్‌మిషన్ <<>>కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 250 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech(EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, IT), డిప్లొమా ఉత్తీర్ణులు NATS పోర్టల్‌లో FEB 26 వరకు ఎన్‌రోల్ చేసుకోవాలి. TG ట్రాన్స్‌కోలో FEB 27వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.15000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: tgtransco.com

News February 21, 2026

ఏఐ సమ్మిట్‌పై జగన్ నకిలీ సానుభూతి: లోకేశ్

image

AP: AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల నిరసనలను <<19201240>>ఖండించిన<<>> YCP చీఫ్ జగన్‌కు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. ‘2017లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు అంతరాయం కలిగించడానికి ఎయిర్‌పోర్టులో ధర్నా చేశారు. 2019లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో విద్యుత్ ఒప్పందాలను, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. 2025లో రుణాలు రాకుండా RBIకి లేఖ రాశారు. ఇప్పుడు AI సమ్మిట్‌పై నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.