News December 28, 2025
అక్షరాల కిన్నెరసానిలో.. జ్ఞాపకాల జూబ్లీ!

వనవాస ప్రాంతాల్లో అక్షర జ్యోతులను వెలిగిస్తూ, గిరిజన బిడ్డలను ప్రపంచ స్థాయికి చేర్చిన కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలు ఆదివారం అంబరాన్నంటాయి. 1975లో స్థాపించబడిన ఈవిద్యాలయం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘గోల్డెన్ జూబ్లీ’ వేడుకలను పూర్వ విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. ఈ పాఠశాల ఎంతో మందిని IAS, IPS, శాస్త్రవేత్తలు, వైద్యులుగా తీర్చిదిద్దిందని వారు గుర్తు చేసుకున్నారు.
Similar News
News December 29, 2025
మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.
News December 29, 2025
విశాఖ పోర్ట్ తొలి మహిళా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని అపరాంజి

మహిళా IAS అధికారి రోష్ని అపరాంజి కోరాటిమ పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం–మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆమె విశాఖ వాసి కావడం విశేషం. ఆమె AU నుంచి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. అస్సాంలో కలెక్టర్‌గా, కేంద్ర డిప్యూటేషన్‌లో VSEZలో సేవలందించిన ఆమెకు 2018లో PM అవార్డు లభించింది.
News December 29, 2025
యాదాద్రిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవేందర్ గౌడ్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఆలయ పండితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


