News December 13, 2025

‘అఖండ-2’లో పాట పడిన నందికొట్కూరు సింగర్

image

బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రంలో పాట పాడిన సింగర్ కరిముల్లాను చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు శుక్రవారం సన్మానించారు. ఆయన చిత్రాని గీసి కరిముల్లాకు అందించారు. నందికొట్కూరుకు చెందిన ఈయన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ‘జై బాలయ్య’ పాటతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. శ్రీనివాసులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో సినీ పరిశ్రమలో మరెన్నో అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు.

Similar News

News December 16, 2025

మంచిర్యాల జిల్లాలో 3వ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న 3వ విడత ఎన్నికల కొరకు అవసరమైన ఏర్పాటు చేశామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమారు దీపక్ తెలిపారు. 3వ విడత ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని చెన్నూరు మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

News December 16, 2025

IPL-2026 మినీ వేలం అప్‌డేట్స్

image

*బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
*రూ.7 కోట్లకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
*రాహుల్ త్రిపాఠిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
*నిస్సాంక- రూ.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
*మాథ్యూ షార్ట్- రూ.1.50 కోట్లు (చెన్నై)

News December 16, 2025

నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

image

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.