News December 12, 2025

‘అఖండ-2’ నిర్మాతలు, BMSపై హైకోర్టు ఆగ్రహం

image

‘అఖండ-2’ నిర్మాతలు, బుక్ మై షో సంస్థపై హైకోర్టు ఆగ్రహించింది. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు?’ అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకున్నారని BMS నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అటు ధరల పెంపు GO రద్దుపై ఈ మూవీ నిర్మాతలు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.

Similar News

News December 16, 2025

జమ్మూకశ్మీర్‌ ప్లేయర్‌కు ఊహించని ధర

image

జమ్మూకశ్మీర్ ప్లేయర్ ఆకిబ్ నబి దార్‌కు ఊహించని ధర లభించింది. ఐపీఎల్ వేలంలో రూ.8.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 29 ఏళ్ల ఈ బౌలర్ కోసం సన్ రైజర్స్, ఢిల్లీ పోటీ పడ్డాయి. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఆకిబ్ ఆక్షన్‌లోకి రావడం గమనార్హం. SMAT 2025-26లో 7 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసుకున్నారు.

News December 16, 2025

జపమాలలో 108 పూసలు ఎందుకు?

image

జపమాలలో ఓ గురు పూసతో పాటు 108 ప్రార్థన పూసలు ఉంటాయి. అందులో 108 పూసలు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను సూచిస్తాయి. భక్తులు ఆ మొత్తం పూసలను లెక్కించడాన్ని ఓ వృత్తం పూర్తైనట్లుగా భావిస్తారు. అలాగే ఇవి పుట్టుక, జీవితం, మరణం.. అనే మన జీవిత చక్రాన్ని చిత్రీకరిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా జపమాల సాధన చేసిన వారికి ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందని, త్వరగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

News December 16, 2025

సిడ్నీ దాడి నిందితుడిది హైదరాబాదే: TG DGP

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో <<18568131>>కాల్పులు<<>> జరిపిన నిందితుడు సాజిద్ అక్రమ్‌ హైదరాబాద్‌కు చెందిన వాడేనని తెలంగాణ డీజీపీ ఆఫీసు తెలిపింది. ‘సాజిద్ 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి నవీద్‌తోపాటు ఓ కుమార్తె కూడా ఉంది. భారత్‌కు 6 సార్లు వచ్చాడు’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. అతడు ఇప్పటిదాకా భారత పాస్‌పోర్టునే వినియోగించినట్లు పేర్కొంది.