News December 12, 2025

అఖండ-2 మూవీ నిర్మాతలకు ఊరట

image

TG: అఖండ-2 మూవీ నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట దక్కింది. టికెట్ ధరల పెంపు జీఓను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందంటూ 14రీల్స్ సంస్థ డివిజన్ బెంచ్‌కు వెళ్లగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ అందరి వాదనలు వినాలని పేర్కొంది. ఈ కేసు విచారణ మళ్లీ అక్కడే జరగాలని తెలిపింది.

Similar News

News December 12, 2025

హైదరాబాద్‌లో అఖిలేశ్.. రేవంత్, కేటీఆర్‌తో భేటీ

image

TG: యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ ఆయనకు వివరించారు. అటు BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోనూ సమావేశమైన అఖిలేశ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

News December 12, 2025

WTCలో ఆరో స్థానానికి పడిపోయిన ఇండియా

image

వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్ టేబుల్‌లో IND స్థానం మరింత దిగజారింది. తాజాగా WIపై NZ విజయం సాధించడంతో WTC పాయింట్ల పట్టికలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో కివీస్‌ మూడో ప్లేస్‌కు చేరుకోగా భారత్‌ ఐదు నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది. దీంతో భారత్‌కు <<18401686>>WTC<<>> ఫైనల్‌ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం AUS అగ్రస్థానంలో ఉండగా, SA రెండో స్థానంలో కొనసాగుతోంది.

News December 12, 2025

మోతాదుకు మించి ఎరువులు వద్దు

image

వ్యవసాయంలో నేల, నీరు, విత్తనం తర్వాత ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అధిక దిగుబడుల కోసం నిపుణుల సూచనలను పక్కనపెట్టి రైతులు ఎక్కువగా ఎరువులను వాడుతున్నారు. దీని వల్ల పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఎరువుల వృథా జరుగుతోంది. అధికంగా వేసిన ఎరువులను మొక్కలు పరిమితంగానే వినియోగించుకుంటాయి. మిగిలినవి భూమిలోకి చేరుతాయి. అందుకే వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పంట దశను బట్టి రైతులు ఎరువులను వాడటం మంచిది.