News December 12, 2025
‘అఖండ-2’ సీక్వెల్ ఉంటుందా?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎండ్ కార్డ్‌లో ‘జై అఖండ’ అనే టైటిల్ పోస్టర్ ఇవ్వడంతో సీక్వెల్‌పై చర్చ మొదలైంది. కాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న ‘నెట్‌ఫ్లిక్స్’లో త్వరలో ‘అఖండ-2’ స్ట్రీమింగ్ కానుంది. మూవీ చూసిన వారు ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 13, 2025
గేదె ఇచ్చే పాలను ఒక్కపూటే చూసి మోసపోవద్దు

☛ గేదెను కొనేటప్పుడు అది ఇచ్చే పాలను కేవలం ఒకపూట మాత్రమే చూసి మోసపోవద్దు. కొనే రోజు సాయంత్రం, తర్వాతి రోజు ఉదయం, సాయంత్రం దగ్గరుండి పాలు పితికించి తీసుకోవాలి. అప్పుడే ఆ గేదె పాల సామర్థ్యం తెలుస్తుంది.
☛ గేదెను కొనేముందు దాని ‘పాల నరం’ని చెక్ చేయాలి. ఇది పొట్ట కింద, పొదుగు వైపు వెళ్లే లావుపాటి నరం. ఇది స్పష్టంగా కనిపించాలి. ఇది ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ పాలు వస్తాయంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 13, 2025
హీరోయిన్ ఇలా మారిపోయారేంటి?

మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘కడలి’ మూవీ హీరోయిన్ తులసీ నాయర్ లుక్ షాక్‌కు గురి చేస్తోంది. ఎక్కువ లావు అవ్వడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆమెకు ఏమయ్యిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆరోగ్య సమస్యలతోనే ఇలా మారినట్లు తెలుస్తోంది. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ చిన్నకూతురే ఈ తులసి. కేవలం రెండు చిత్రాల్లోనే నటించి ఇండస్ట్రీకి దూరమయ్యారు. మరో కూతురు కార్తీక కూడా పలు చిత్రాల్లో నటించారు.
News December 13, 2025
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ఢిల్లీ సర్కార్ చట్టం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తాజాగా దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం అనుమతించిన ఫీజు ధరలనే స్కూల్స్ వసూలు చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25, అడ్మిషన్ ఛార్జీలు రూ.200గా నిర్ణయించారు. 3 ఏళ్లపాటు ఫీజులు స్థిరంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఇటువంటి చట్టం తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకొస్తే బాగుంటుంది కదా?


