News December 21, 2025

‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

image

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.

Similar News

News January 1, 2026

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ GOపై హైకోర్టు నోటీసులు

image

AP: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై జారీచేసిన GO 225పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో విడుదల చేశారని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై కోర్టు ఈ నోటీసులిచ్చింది. PILపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

News January 1, 2026

UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

image

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్‌‌ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు వల్ల కలిగే నష్టం

image

మారుకా మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో మినుము పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటంవలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ తెగులును సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదు.