News March 28, 2025
అగ్నివీర్‌కు ఎంపికైన నర్సాపూర్ (జి) వాసి

నర్సాపూర్ (జి) మండలంలోని అర్లి(కే) గ్రామానికి చెందిన పోసాని -రాములు దంపతుల కుమారుడు రాజశేఖర్ ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్‌కు ఎంపికయ్యాడు. తల్లి బీడీ కార్మికురాలు కాగా తండ్రి వ్యవసాయం చేస్తూ చదివించారు. చిన్ననాటి నుంచి దేశ సేవ చేయాలనే సంకల్పంతో అగ్ని వీర్‌కు ప్రయత్నించి విజయం సాధించానని యువకుడు రాజశేఖర్ తెలిపారు. ఆయన్ను గ్రామస్థులతో పాటు మండల వాసులు అభినందించారు.
Similar News
News March 31, 2025
ఏప్రిల్ 2న ఏం జరగనుంది?

అగ్రరాజ్య అధినేత ట్రంప్ APR 2న తీసుకోనున్న ఓ నిర్ణయంపై భారత్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. IND నుంచి USకు ఎగుమతి అవుతున్న మందులపై 25% టారిఫ్ విధిస్తామని, దానిపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. మనం ఏటా 30బి.డాలర్ల మందులు విక్రయిస్తుండగా, 3వ వంతు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం మన ఎగుమతులపై అమెరికాలో పెద్దగా సుంకాల భారం లేనప్పటికీ భారత్ US నుంచి వస్తున్న వాటిపై 10% సుంకం వసూలు చేస్తోంది.
News March 31, 2025
నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.
News March 31, 2025
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.