News August 19, 2025
అగ్నివీర్ ర్యాలీలో విజయనగరం యువకుడి మృతి

కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి (M) శ్రీహరి నాయుడుపేటకు చెందిన జి.సాయి కిరణ్ (19) మంగళవారం 1600 మీటర్ల పరుగులో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News August 20, 2025
ఆ బిల్లు ఆపండి: అమిత్ షాకు AIGF లేఖ

బెట్టింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ <<17459059>>బిల్లును<<>> ఆపాలని హోంమంత్రి అమిత్ షాకు ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్(AIGF) లేఖ రాసింది. దీని వల్ల గేమింగ్ సెక్టార్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కోట్లాది మంది గేమర్లు ఇల్లీగల్ గ్యాంబ్లర్లుగా మారే ప్రమాదముందని తెలిపింది. ఒకేసారి బ్యాన్ చేయకుండా క్రమంగా నియంత్రించాలని సూచించింది. కాగా దేశంలో గేమింగ్ సెక్టార్ విలువ ₹2లక్షల కోట్లు.
News August 20, 2025
భువనగిరి: చెరువులో స్నానానికి దిగి యువకుడి గల్లంతు

మర్యాలలోని కురుమనుకుంట చెరువులో పడి నందులాల్ (23) అనే ఉత్తరప్రదేశ్ యువకుడు గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న క్రషర్ కంపెనీలో పనిచేసే నందులాల్ మంగళవారం ఉదయం స్నానం చేయడానికి చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీశైలం బృందం గాలింపు చర్యలు చేపట్టింది. రాత్రి వరకు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
News August 20, 2025
సీఎం పర్యటన వాయిదా.. నిరాశలో ఆదివాసీలు

సీఎం బెండాలపాడు పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. దశాబ్ధాలుగా తాము ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరుతోందని, తాము గృహ ప్రవేశం చేయబోతున్నామని కొండంత అశతో ఉన్న ఆదివాసీలు నిరాశకు గురయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, అధికారుల హడావుడితో వారం రోజులుగా గ్రామంలో పండుగా వాతావరణం నెలకొంది. కానీ ఆయన పర్యటన వాయిదాతో స్తబ్దత ఏర్పడింది. సీఎం త్వరగా తమ గ్రామానికి రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.