News April 3, 2025
అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట <<15975525>>పెద్దిరెడ్డిగూడెం <<>>పంచాయతీ టిడి బంజరలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) సజీవ దహనం అయ్యాడు. మరో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.
Similar News
News April 4, 2025
అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్

అమ్మాయి పుడితే ఇంటిల్లిపాది పండగ చేసుకోవాలని, అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే ఆడపిల్లలు పుడతారని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కామేపల్లి(మం) కొత్త లింగాలలో ఉండేటి అమృత-సుధాకర్ దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టగా, కలెక్టర్ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం తల్లిదండ్రులను సత్కరించారు.
News April 4, 2025
ధాన్యానికి రూ.500 బోనస్ చరిత్ర: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ప్రజలు మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతును రాజు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో మంత్రి ధాన్యం కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. దేశచరిత్రలోనే మొదటిసారిగా ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో నేతలు, అధికారులు పాల్గొన్నారు.
News April 4, 2025
ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టుకు రూ.29 కోట్లు

ఖమ్మం నగరంలోని ఖిల్లాపై రోప్ వే ప్రాజెక్టుకు జిల్లా యంత్రాంగం రూ.29 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం ఖర్చుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఖిల్లాపై రోప్ వే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఖిల్లా మెట్ల మార్గం కుడి వైపున రెండు అంతస్తుల బేస్ స్టేషను ఏర్పాటు చేయడంతో పాటు రోప్ వేలో 200-250 మంది బరువును తట్టుకునే సామర్థ్యమున్న 275 మీటర్ల తీగలను ఏర్పాటు చేయనున్నారు.