News February 6, 2026

అగ్ని-3 సక్సెస్.. 3 వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!

image

అగ్ని-3 బాలిస్టిక్ మిసైల్‌ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి టెస్ట్ ఫైర్ చేసినట్లు DRDO, రక్షణ శాఖ అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష చేపట్టినట్లు చెప్పారు. అగ్ని-3 మిసైల్ 1.5 టన్నుల బరువు ఉంటుందని, 3 వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను ఛేదించగలదని వెల్లడించారు. అన్ని ప్రమాణాలను అందుకుంటూ లక్ష్యాన్ని చేరుకుందని తెలిపారు.

Similar News

News February 20, 2026

కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

image

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ శుక్రవారం మధ్యాహ్నం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత కేసులు, వాటి పురోగతిపై సీఐ రమేశ్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దన్నారు.

News February 20, 2026

రైల్వేలో 11,127 ఉద్యోగాలు

image

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టెన్త్, ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://indianrailways.gov.in/

News February 20, 2026

‘అవిశ్వాసం’పై INCని ఒంటరి చేసేలా NDA వ్యూహం

image

LS స్పీకర్ ఓం బిర్లాపై INC, ‘ఇండీ’ పక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై MAR 9న చర్చ, ఓటింగ్ జరగనుంది. దీన్ని తిప్పికొట్టేందుకు తగినంత బలం ఉన్నాINCని మరింత ఒంటరి చేసేలా NDA కొత్త వ్యూహంతో వెళ్తోంది. సభలో రాహుల్‌ను మాట్లాడనివ్వలేదన్న కారణంతో ఇచ్చిన ఈ తీర్మానంపై TMC సంతకం చేయలేదు. ఇది INC సొంత వ్యవహారంలా మారిందని ఇతర MPలూ విమర్శిస్తున్నారు. దీంతో వారి మద్దతు ఉపసంహరించేలా NDA తెరవెనుక ప్రయత్నిస్తోంది.