News November 20, 2024
అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టక తప్పదని మంత్రి స్వామి అన్నారు. మంగళవారం విశాఖలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 31, 2025
మార్కాపురం కలెక్టర్, SP ఎవరంటే..?

నేటి నుంచి మార్కాపురం జిల్లాగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో నూతన జిల్లాకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం కలెక్టర్ రాజాబాబును మార్కాపురం ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా, జేసీ గోపాలకృష్ణను ఇన్‌ఛార్జ్ జేసీగా, ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఇన్‌ఛార్జ్ ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. సరికొత్త జిల్లాకు తొలి కలెక్టర్, జేసీ, ఎస్పీలుగా వీరు బాధ్యతలు స్వీకరిస్తారు.
News December 31, 2025
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఇదే!

మార్కాపురంను నూతన జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల రిహాబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కాలనీలో ఉన్న భవనాన్ని కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం నుంచి పరిపాలన వ్యవహారాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భవనానికి నూతన హంగులనిచ్చారు.