News February 15, 2025

అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ

image

ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గుర్రంకొండ మండలంలో యువతిపై యాసిడ్ దాడి ఘటన సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ మదనపల్లెలోని మఖాం వేశారు. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు.

Similar News

News July 7, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

News July 7, 2025

‘నేడు స్కూళ్లకు సెలవు’ అని మీకు మెసేజ్ వచ్చిందా?

image

TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యాలు ఇవాళ సెలవును ప్రకటించాయి. ‘మొహర్రం సెలవు’ అంటూ పేరెంట్స్‌ ఫోన్లకు మెసేజులు పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఆదివారం రోజే ఉంది. అటు పలు స్కూళ్లు మాత్రం ఇవాళ సెలవు లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. దీంతో కొందరిలో గందరగోళం నెలకొంది. మరి మీకు సెలవు మెసేజ్ వచ్చిందా? కామెంట్.

News July 7, 2025

ములుగు జిల్లాలో టెన్షన్.. టెన్షన్..!

image

జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చల్వాయికి చెందిన చుక్క రమేశ్ ఆత్మహత్య వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు ఇస్తున్నాయంటూ రమేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కేసు నమోదుతో భయాందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపడతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కాగా నేడు మంత్రుల పర్యటన ఉంది.