News March 19, 2025
అచ్చంపేట: అర్హత లేని ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు

అచ్చంపేట పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రిలో ఎలాంటి అర్హత లేని ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తుండగా వారిపై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు. సాయి క్లినిక్‌లో నరేందర్, కావేరి పాళీ క్లినిక్‌లో లింగాచారి ఎంబీబీఎస్ అర్హత లేకుండా రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు.
Similar News
News November 2, 2025
కొండవీడు ఘాట్ రోడ్డు మూసివేత

కొండవీడు కొండలపై నుంచి ఘాట్ రోడ్డులోకి ఊట నీటితో బండరాళ్లు జారిపడే ప్రమాదం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ తెలిపారు. ఇటీవల పడిన కొండ చర్యల తొలగింపు పనులను ఆమె శనివారం పరిశీలించారు. ఆది, సోమవారాల్లో ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులు, సందర్శకులు కొండవీడుకు రావద్దని ఆమె కోరారు.
News November 2, 2025
నిజాంపేట: ఇదేనేమో నేటి టెక్నాలజీ..!

రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ ప్రభావం గ్రామాల్లో జరిగే సంప్రదాయ విక్రయాల్లోనూ కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు, వివిధ వస్తువులు అమ్మేవారిని చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా నిజాంపేటలో గాడిది పాలు అమ్మే ఓ వ్యక్తి మైక్‌లో ‘గాడిద పాలు’ అంటూ ప్రకటన చేస్తూ విక్రయిస్తున్నారు. మైక్ శబ్దం విని అతడిని చూసిన స్థానికులు..’ఇదేనేమో నేటి టెక్నాలజీ’ అంటూ చర్చించుకుంటున్నారు.
News November 2, 2025
కాంగ్రెస్ కార్యాలయాన్ని BRSగా మార్చడమే ఆందోళనకు కారణమా..?

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగా కాంతారావు 2018లో గెలిచారు. ఆ తరువాత BRSలో చేరి అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ కార్యాలయ వివాదం తెర మీదికి వచ్చింది. దీంతో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌కి నిప్పు పెట్టారు. అనంతరం కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.


