News March 27, 2025

అచ్చంపేట: ఈనెల 29న పశువులు, మేకలు, గొర్రెల సంతకు వేలం పాట

image

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న 2025 -26 పశువులు, మేకలు, గొర్రెల సంత వేలంపాట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఈనెల 29 ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ యాదయ్య, ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. రూ10 లక్షల నగదు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని వారు సూచించారు. రూ.15 వేల తిరిగిరాని రుణంతో దరఖాస్తు చేసుకోవాలని పాల్గొనేవారిని కోరారు.

Similar News

News February 28, 2026

NGKL: ఇంటర్ పరీక్షలు.. 159 మంది గైర్హాజరు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. జిల్లాలో మొత్తం 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. 159 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

News February 28, 2026

విజయవాడ మీదుగా హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా పొడనూర్(PTJ)- బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06021 PTJ- BJU రైలు మార్చి 2, 9వ తేదీలలో, నం.06022 BJU- PTJ రైలు మార్చి 5, 12 తేదీలలో ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరులో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

News February 28, 2026

కుమ్మెర బాధితులతో కలిసి OUలో నిరసన

image

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసులు బాధితులకు అండగా నిలవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.