News April 4, 2025

అచ్చంపేట: ఈయన చనిపోయాడు.. గుర్తుపడితే చెప్పండి..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఓ గుర్తుతెలియన వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా ప్రయాణికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే అచ్చంపేట పోలీసుల నంబర్ 8712657733కు ఫోన్ చేయాలని సబ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 

Similar News

News April 4, 2025

పవన్ కళ్యాణ్ మాటకు నిలబడి ఉంటాం: GVMC జనసేన కార్పొరేటర్లు

image

విశాఖ జనసేన పార్టీ ఆఫీసులో జీవీఎంసీ జనసేన కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాటకు నిలబడి ఉంటామని జనసేన కార్పొరేటర్లు అన్నారు. ‘అవిశ్వాసంలో పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే మా తుది నిర్ణయం’ అని అన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ అవిశ్వాసంపై ఒకే తాటిపై ఉంటామని భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు. త్వరలో కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు PAC సభ్యులు తాతారావు వెలెల్లడించారు.

News April 4, 2025

MDCL: మీకు కార్లు.. మాకు కాలినడకా..?

image

MDCL జిల్లా అంతాయిపల్లిలో కలెక్టరేట్ ప్రారంభమై ఏళ్లు గడుస్తుంది. కానీ.. ఇప్పటికీ కలెక్టరేట్ వెళ్లేందుకు సరైన ప్రయాణ సౌకర్యంలేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో దొంగల మైసమ్మ దేవాలయం వద్ద ఆర్టీసీ బస్ దిగి 3.5KM నడవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు, సంపన్నులు ఆఫీసుకు కార్లలో వెళ్తున్నారన్నారు. మీకు కార్లు.. మాకు కాలినడకా..? అని ప్రశ్నించారు. 

News April 4, 2025

చైనా ప్రతీకార సుంకాలు.. స్పందించిన ట్రంప్

image

ట్రంప్ తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా కూడా 34శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దానిపై ట్రంప్ స్పందించారు. ‘వారు మాపై సుంకాలు విధించలేరు. అది వారికి మంచిదికాదు. కానీ టెన్షన్ పడ్డారు. తప్పటడుగు వేశారు’ అని తన ట్రూత్ సోషల్‌లో వ్యాఖ్యానించారు. సుంకాలతో పాటు అరుదైన వనరుల ఎగుమతులపై, రక్షణ రంగ సంబంధితమైన 30 అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది.

error: Content is protected !!