News February 21, 2025
అచ్చంపేట మార్కెట్‌కు భారీ ఆదాయం

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు సాగుచేసిన పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేశారు. 7741 రైతుల నుంచి 2లక్షల11వేల834 క్వింటాళ్ల పత్తిని 3 జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ వారు కొనుగోలు చేశారు. 1% శాతం మార్కెట్ ఫీజు ఆధారంగా ఒక రూ.1,55,34,554 మార్కెట్‌కు ఆదాయం వచ్చినట్లు కార్యదర్శి నరసింహులు వెల్లడించారు.
Similar News
News November 7, 2025
తిరుపతి, చిత్తూరులో పవన్ పర్యటన ఇలా..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో Dy.CM పవన్ పర్యటన ఖరారైంది. ఈనెల 8న ఉదయం 10 గంటలకు రేణిగుంటకు వస్తారు. మామండూరు అటవీ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేసి అదేరోజు రాత్రి విజయవాడ వెళ్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి పలమనేరు(ముసలిమడుగు) కుంకి ఏనుగుల క్యాంప్‌నకు చేరుకుంటారు.
News November 7, 2025
WGL: రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధరలు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గుతూ కంటతడి పెట్టిస్తున్నాయి. క్వింటా పత్తి ధర సోమవారం రూ.6,920, మంగళవారం రూ.6,950, గురువారం రూ.6,900 పలికాయి. నేడు మరింత పతనమై రూ.6,860కి చేరింది. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
News November 7, 2025
264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

AP: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీఎస్పీలో 19 SI, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27లో 10 SI, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 SI, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.


