News September 6, 2025

అచ్చంపేట: రేపు ఉమామహేశ్వర ఆలయం మూసివేత

image

అచ్చంపేట మండలంలోని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అచ్చంపేట మండలం ఉమామహేశ్వర దేవస్థానాన్ని రేపు ఆదివారం ఉదయం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు మూసి వేయడం జరుగుతుందని ఆలయ ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి, ఈవో శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Similar News

News September 7, 2025

జగిత్యాల: ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేత

image

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును, ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లాలోని 60మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి అవార్డును, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, డీఈఓ రాము తదితరులున్నారు.

News September 7, 2025

జగిత్యాల: ‘అవినీతి లేని ఉత్తమ వృత్తి.. ఉపాధ్యాయ వృత్తి’

image

తండ్రి ఆస్తులు అందిస్తే.. గురువు జ్ఞానాన్ని అందిస్తాడని, జ్ఞానం మీ సంపద అయితే విజయం నీ బానిస అవుతుందని MLC చిన్నమయిల్ అంజిరెడ్డి అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అవినీతి లేని ఉత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు. కెరీర్ గైడెన్స్ అనే పుస్తకం విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఈ పుస్తకాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.

News September 7, 2025

జగిత్యాల: ‘సర్వేపల్లి రాధాకృష్ణను స్ఫూర్తిగా తీసుకోవాలి’

image

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు వచ్చే వేతనంలో 75% పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించే వారన్నారు. భారత ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలందించారన్నారు.