News December 7, 2025

అచ్చంపేట: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి: తాహశీల్దార్

image

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తహశీల్దార్ సైదులు అన్నారు. రేషన్ షాపులు ప్రతి నెల 1వ తేది నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరచి ఉంచాలన్నారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

Similar News

News December 8, 2025

రెచ్చగొట్టేలా జైశంకర్‌ వ్యాఖ్యలు: పాకిస్థాన్

image

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.

News December 8, 2025

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 8, 2025

సిద్దిపేట: ఈ మండలంలో 6 సర్పంచులు ఏకగ్రీవం

image

సిద్దిపేట జిల్లాలోనే 38 గ్రామపంచాయతీలతో అతిపెద్ద మండలం అక్కన్నపేట. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలకు అక్కన్నపేట మండలం మూడో విడత ఎన్నికలకు ఎంపికైంది. మండలంలోని శ్రీరామ్ తండా, దుబ్బతండా, చౌడుతండా, దాసుతండా, గొల్లపల్లి, కుందనవానిపల్లి 6 గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండలంలో చాలా గ్రామాల్లో వార్డులు కూడా ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవ ఎన్నికల జరిగాయి.