News June 27, 2024
అచ్చంపేట: లింక్ క్లిక్ చేస్తే అంతే!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేయడంతో ఓ వ్యక్తి రూ. 96 వేలు పోగొట్టుకున్నాడు. అచ్చంపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన బిచ్యానాయక్ ఫోన్‌కు క్రిడెట్ కార్డు పోరుతో ఓ లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 96 వేలు మాయమయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న ప్రచారం

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.
News February 8, 2026
MBNR: పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఎన్నికల విధులలో పాల్గొనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రామంజుల రెడ్డి కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.


