News April 4, 2025

అచ్యుతాపురంలో రోడ్డు ప్రమాదం.. ఫార్మా ఉద్యోగి మృతి

image

అచ్యుతాపురంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌వీఆర్ డ్రగ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి బగాది రమణారావు దుర్మరణం చెందాడు. బైక్‌పై విధులకు వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం తగిన పరిహారం అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 12, 2025

సామాజిక చైతన్యానికి బాలోత్సవాలు: కలెక్టర్

image

బాలోత్సవాలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యానికి సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి ఆటలు పాటలు ఉంటే చెడు మార్గం వైపు వెళ్లరని అన్నారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ..సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు రకాల వ్యసనాలతో విద్యార్థి యువత పెడదోవ పడుతున్నారని అన్నారు.

News December 12, 2025

పిట్టవానిపాలెం: బైకులు ఎదురెదురుగా ఢీ.. ఇద్దరు మృతి

image

పిట్టలవానిపాలెం మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కుంచాలవారిపాలెం వంతెన వద్ద నుంచి పిట్టలవానిపాలెం వెళ్లే రహదారిలో పెద్దపల్లికి చెందిన ఆటల భాను(20), చినమట్టపూడికి చెందిన షేక్ జాన్ సైదా(30) బైకులు ఎదురెదురుగా ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందగా, జాన్ సైదా భార్యకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 12, 2025

VZM: ‘హెల్త్ కవరేజ్‌లో ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి’

image

పుష్పగిరి కంటి ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు సీనియర్ సివిల్ జడ్జి & డీఎల్ఎస్ఎ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు కూడా అందరికీ అందిస్తామన్నారు.