News November 11, 2025
అచ్యుతాపురం: ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో అచ్యుతాపురంలో పలు కంపెనీల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఏ.ఆర్.టీ.టైర్ కంపెనీ 3వ యూనిట్, లారస్ కంపెనీ 8వ యూనిట్‌ను ప్రారంభించారు.అలాగే లారెన్స్ ల్యాబ్, లారస్ సింథటిక్ యూనిట్‌కి శంకుస్థాపన చేశారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

BREAKING: HYD: మాగంటి సునీతపై కాంగ్రెస్ ఫిర్యాదు

BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఎలక్షన్ కమిషన్‌కి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రెస్‌మీట్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి సునీత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసింది. ఎన్నిక జరుగుతుండగానే ప్రెస్‌మీట్ పెట్టారని పేర్కొంది. ప్రెస్‌మీట్ నిర్వహించొద్దని,ఒకవేళ నిర్వహిస్తే ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఇప్పటికే ECI స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపింది.