News August 21, 2024

అచ్యుతాపురం: ముక్కలు ముక్కలైన శరీర అవయవాలు

image

అచ్యుతాపురం ఫార్మా ఘటనలో మనసును కలిచి వేసే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కొందరు కార్మికుల శరీర అవయవాలు ముక్కలుముక్కలయ్యాయి. కనీసం మృతదేహాలను గుర్తించే స్థాయిలో కూడా లేకపోవడం ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఫార్మాసిటీ సమీపంలోని ముళ్ల పొదల్లో మాంసం ముద్దలు పడి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.  

Similar News

News January 20, 2025

ఆనందపురం: లంకె బిందెల పేరుతో రూ.28 లక్షలు స్వాహా

image

ఆనందపురం మండలం బీపీ కళ్లాలకు చెందిన నలుగురు వద్ద నుంచి లంకె బిందెలు పేరుతో ముగ్గురు వ్యక్తులు రూ.28 లక్షలు కాజేశారు. దీనిపై ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. తన దగ్గర బంగారు నిధి ఉందని పూజలు చేయడానికి రూ.30 లక్షలు అవుతుందని నకిలీ స్వామీజీ నమ్మించాడు. బాధితులు దఫదఫాలుగా నిందితులకు రూ.28 లక్షలు ఇచ్చారు. ఈనెల 2న బాధితులకు రెండు బిందెలు ఇచ్చి వారు వెళ్లిపోయారు. తర్వాత చూడగా వాటిలో ఏమి లేవు.

News January 20, 2025

ఎండాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

ఎండాడ సాయిరాం పనోరమ హిల్స్ వద్ద నూతనంగా నిర్మాణంలో ఉన్న భవంతులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంగా ఉండి మద్యం తాగి మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

News January 19, 2025

విశాఖ: రూ.1,586.08కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

image

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.1,586.08 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశం శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగింది. బడ్జెట్‌లో ఆదాయం రూ.1589.13, వ్యయం రూ.1586.08 కోట్లుగా చూపించారు. త్వరలో దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు.