News January 13, 2026

అజాగ్రత్త వద్దు.. రోడ్డు నియమాలు పాటించండి: ఎస్పీ

image

వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సుజాతనగర్లో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి బసిత్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News February 16, 2026

చిత్తూరు SP పరిష్కార వేధికకు 36 అర్జీలు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News February 16, 2026

తిరుపతి కలెక్టరేట్‌కు 443 అర్జీలు.!

image

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 443 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు తాగునీరు, మెడికల్ క్యాంప్, టీ వంటి సౌకర్యాలు కల్పించి వారి వినతులను స్వీకరించామన్నారు. శాఖలవారీగా రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 280 అర్జీలు వచ్చాయన్నారు.

News February 16, 2026

MBNR: U-17 క్రికెట్ టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్

image

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో మహబూబ్‌నగర్, రెండో స్థానంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈఓ మంజులాదేవి, SGF సెక్రటరీ ఆర్.శారదాబాయి, స్థానిక నేతలు, పీడీలు పాల్గొన్నారు.