News January 29, 2026
అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన లోకేశ్

AP: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతికకాయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలో నిర్వహించిన పవార్ అంత్యక్రియల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తదితర ప్రముఖులూ పవార్‌కు వీడ్కోలు పలికారు.
Similar News
News February 18, 2026
దేవాలయంలో ఏ దానంతో ఏ పుణ్యం?

గుడిలో వస్తురూపేణా చేసే దానాలు విశేష ఫలితాలనిస్తాయి. శంఖం దానంతో పుణ్యలోక ప్రాప్తి, గంట దానంతో కీర్తి, గజ్జెల దానంతో సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘ధ్వజస్తంభంతో యశస్సు, జెండాలతో పాపవిముక్తి, సుగంధ ద్రవ్యాలతో రూప సంపత్తి, పందిళ్లు నిర్మిస్తే ధర్మబుద్ధి కలుగుతాయి. ఇలా ఆలయ అభివృద్ధికి, సౌకర్యాలకు చేసే సాయం భక్తులకు ఇహపర సుఖాలు కలుగుతాయి’ అని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది.
News February 18, 2026
రోజూ 10 నిమిషాలు ఎండలో ఉంటే..

రోజుకు 10 నిమిషాలైనా ఎండలో ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘సూర్యరశ్మి వల్ల విటమిన్-D పెరుగుతుంది. ఇది ఎముకల బలానికి అవసరమైన కాల్షియంను గ్రహించడానికి సాయపడుతుంది. మూడ్‌ని మార్చేసి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తుంది. చర్మంలోని నైట్రిక్ ఆక్సైడ్ విడుదలయ్యేలా చేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది’ అని చెబుతున్నారు.
News February 18, 2026
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు!

TG: 2025-2028కు సంబంధించి ప్రైవేటు ఇంజినీరింగ్ ఫీజులను రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ఖరారు చేసింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. 63 కళాశాలల్లో పెంచగా, 19 కాలేజీల్లో తగ్గించింది. ఓ సంస్థలో అత్యధికంగా ₹62 వేలు పెరిగింది. CBITలో అత్యధికంగా ₹1.83 లక్షల ఫీజు ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి ఈ మేరకు TAFRC నివేదిక పంపింది. త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది.


