News November 17, 2025

అజొల్లాను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?(1/2)

image

చెట్ల నీడలో గోతులు తవ్వి లేదా సిమెంట్ తొట్టెలలో లేదా పోర్టబుల్ కంటైనర్‌ ఉపయోగించి అజొల్లాను పెంచవచ్చు. గోతులు తవ్వి అజొల్లాను పెంచితే బయటి నుంచి ఎటువంటి వేర్లు లోపలికి రాకుండా ప్లాస్టిక్ సంచులను గోతి లోపల పరచాలి. దాని మీద పాలిథీన్ షీట్ పరిచి నీరు నిల్వ ఉంచే కృత్రిమ తొట్టెలా తయారు చేసుకోవాలి. 10-15 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మొత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధంగా ఉండేలా చల్లుకోవాలి.

Similar News

News April 5, 2026

IPL హీట్: టాలీవుడ్ కలెక్షన్లకు గండి!

image

IPL మ్యాచ్‌లు ఉండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆడియెన్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాకాస’, ‘బైకర్’ వంటి సినిమాలకు మ్యాచ్‌ల సెగ తగులుతోంది. ఏప్రిల్ 10న రాబోతున్న ‘డెకాయిట్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాలకు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. మే నెలాఖరు వరకు IPL సందడి కొనసాగనుంది. కంటెంట్ బాగుంటే తప్ప ఈ ‘క్రికెట్ తుఫాను’ను తట్టుకోవడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

News April 5, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ రూ.230-రూ.300 మధ్య ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.290, వరంగల్‌లో రూ.280, కామారెడ్డి జిల్లాలో రూ.280-రూ.290 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.230, గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News April 5, 2026

మాచర్ల CI వెంకటరమణ సస్పెన్షన్

image

AP: ప్రేమ వివాహం చేసుకున్న <<19545664>>చౌడేశ్వరిని<<>> నిబంధనలకు విరుద్ధంగా, బలవంతంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించినందుకు మాచర్ల CI వెంకటరమణను జిల్లా SP సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. CI అప్పగించిన కాసేపటికే ఆమె హత్యకు గురవడంతో ఈ నేరంలో ఆయన పాత్రపై ఆరోపణలొచ్చాయి. దీంతో CIపై SP కృష్ణారావు చర్యలు తీసుకున్నారు.