News April 7, 2025

అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవండి: వరంగల్ సీపీ

image

మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్  పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిబ్రవరి 21న వరంగల్ సీపీ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డ్‌ను అందజేశారు. పోలీస్ అధికారులు ఉన్నారు.

Similar News

News April 7, 2025

HNK: 9 నుంచి ప్రాక్టికల్ తరగతులు

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు డిగ్రీ బీఎస్సీ, ఎంఎస్సీ, సీఎస్ కోర్సుల మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రాక్టికల్ తరగతులు జరుగుతాయని దూరవిద్య సంచాలకులు ఆచార్య సురేష్ లాల్, సహాయ సంచాలకులు వెంకట్ గోపీనాథ్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 7, 2025

HCU నుంచి బందోబస్తు ఉపసంహరణ

image

TG: HCU వీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖ రాశారు. పౌర సంఘాలు, ఉపాధ్యాయ జేఏసీ విజ్ఞప్తితో క్యాంపస్ నుంచి పోలీస్ బందోబస్తు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. కాగా విద్యార్థులపై కేసులను వెనక్కి తీసుకుంటామని ఇప్పటికే భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 7, 2025

NLG: యాక్సిడెంట్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి డ్రైవర్ మృతి

image

నిడమనూరు మండలం గుంటిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కారు డ్రైవర్ నరసింహగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

error: Content is protected !!