News July 20, 2024
అటవీ గ్రామాలను చుట్టుముడుతున్న వాగులు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చర్ల మండలంలోని గ్రామాలను వాగులు చుట్టు ముడుతున్నాయి. కుర్నపల్లి పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ వాగులు కమ్మేయడంతో బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. కుర్నపల్లి-రామ చంద్రాపురం మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు ప్రభుత్వంగా ఉండాలని అధికారులు సూచించారు
Similar News
News August 22, 2025
విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం DMHO

సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి కళావతి బాయి సూచించారు. నీళ్లు నిల్వ ఉన్న చోట, మురుగు ప్రదేశాల్లో లార్వాను అభివృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
News August 22, 2025
కేంద్రంతో కొట్లాడైనా యూరియా అందిస్తాం: పొంగులేటి

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా రాష్ట్రానికి యూరియా కేంటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కావాలనే తప్పుడు లెక్కలు చూపిస్తూ యూరియా కేటాయింపులు చేయడం లేదని, గట్టిగా అడిగితే అదిగో.. ఇదిగో ఇస్తున్నాం అంటూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో కోట్లాడైనా సరే రైతులకు యూరియా సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.
News August 22, 2025
ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరగనున్న పర్యటన వాయిదా పడిందని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి పర్యటన వాయిదా పడిందని తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.