News September 14, 2025
అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు..?

పాకాల(M) సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేళాడుతుండగా, మరో మహళ డెడ్ బాడీ నేలపై ఉంది. అవి గుర్తు పట్టలేనంతగా మారినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే మరో రెండు గుంతలు తవ్వి, వాటిపై బండరాళ్లను ఉంచారు. ఆ గోతిలో చిన్న పిల్లల మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2025
పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు: అధికారులు

AP: <<17705296>>తురకపాలెం<<>>లో నీటిలో పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. తాగు నీటిలో యురేనియం లీటరుకు 30 మైక్రో గ్రాములు(0.03 mg/l)గా ఉంటుందని, తురకపాలెంలో యురేనియం ఆనవాళ్లు 0.001 mg/l కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు రోజులుగా కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదన్నారు.
News September 14, 2025
NZB: STU ఏడు మండలాల కార్యవర్గ సభ్యుల ఎన్నిక

నిజామాబాద్ జిల్లాలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ఏడు మండలాల కార్యవర్గ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎడపల్లి మండల అధ్యక్షుడిగా యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా భూపతి ఎన్నికయ్యారు. నవీపేట అధ్యక్షుడిగా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఎంపికయ్యారు. అదే విధంగా నిజామాబాద్ నార్త్, సౌత్, డిచ్‌పల్లి, ఆలూరు, మోపాల్ మండలాల నూతన అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు.
News September 14, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ ఏటికొప్పాక లక్క బొమ్మలను ఆసక్తిగా తిలకించిన జేపీ నడ్డా
➤ దిబ్బపాలెంలో ఉత్సాహభరితంగా ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు
➤ ఘనంగా జాతీయ హిందీ భాషా దినోత్సవం
➤ చోడవరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
➤ మారేపల్లిలో కోళ్ల కళేబరాలు పూడ్చివేత
➤ చోడవరంలో ఆది గణపతి కళ్యాణోత్సవం
➤ నాతవరం ఎస్‌ఐగా తారకేశ్వరరావు బాధ్యతల స్వీకరణ