News September 4, 2024

అటవీ ప్రాంతాన్ని, వన్య ప్రాణులను కాపాడాలి: కలెక్టర్

image

కడప జిల్లాలోని అటవీ ప్రాంతాలను, వన్య ప్రాణులను సంరక్షించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ, డిస్టిక్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలలో టూరిజం స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు. ఆయా టూరిజం స్పాట్లలో పర్యాటకులు సందర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

Similar News

News January 29, 2026

కడపలో ఇంటిని కూల్చిన ఘటన update

image

కడపలోని ఎర్రముక్కపల్లి కందిపాలెంలో రెండు రోజుల కిందట ఇంటిని అర్ధరాత్రి కూల్చిన ఘటనలో ద్వారకనాథరెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ వి.చిన్నపెద్దయ్య తెలిపారు. ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News January 29, 2026

ఒంటిమిట్ట: ఇవాళ ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సన్నిధిలో ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలకరించి, ఘనంగా గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.

News January 28, 2026

ఫిబ్రవరి 2 నుంచి సంపూర్ణత అభియాన్ ప్రారంభం: కలెక్టర్

image

ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సంపూర్ణత అభియాన్ 2.0 ప్రారంభించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన పలు ఇండికేటర్లను పక్కాగా అమలు చేయాలన్నారు. గత ఏడాది 100% విజయం సాధించిన నేపథ్యంలో మార్చి నెలాఖరికి అన్ని అంశాల్లో 100% సాధించి ప్రధాన స్థానంలో నిలవాలన్నారు.