News March 30, 2025
అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించాలని అధికారులను సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 1, 2025
వజ్రపుకొత్తూరు: గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి

సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన బొంగు ధనరాజు (35), వంక కృష్ణారావు (40) చనిపోయారు. మృతులకు భార్యాపిల్లలు ఉన్నారు. నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుల మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 1, 2025
RGM: GDK-11వ గని బొగ్గు ఉత్పత్తిలో టాప్

రామగుండం సింగరేణి సంస్థ GDK-11వ గనిలో మార్చిలో నిర్దేశించిన 69,600 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను ఒకరోజు ముందుగానే 71,893 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా GM లలిత్ కుమార్ అభినందించారు. అలాగే RG- 3 CHPలో ఉత్పత్తి అయిన 30,839 టన్నుల బొగ్గును ఒక రోజులో 15 రైల్వే రేకుల ద్వారా NTPC విద్యుత్ పరిశ్రమకు రవాణా చేసిందని అధికారులు పేర్కొన్నారు.
News April 1, 2025
కొమరాడ: 45 రోజుల కష్టం.. రోజుకు రూపాయి

కొండ చీపుర్లకు మద్ధతు ధర పలకడం లేదని తయారీదారులు వాపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గిరిజన ప్రాంతాల ప్రజలు కొండ చీపుర్లు కొనుగోలు చేసి జీవనం సాగిస్తుంటారు. 45 రోజులు పాటు కష్టపడి తయారు చేస్తే ఒక్కో చీపురును దళారులు రూ.40కి కొనుగోలు చేసి బయట రూ.70 వరకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జీసీసీ ద్వారా కొండ చీపుర్లను మద్దతు ధరకు కొనుగోలు కొనగోలు చేయాలని వేడుకున్నారు.