News October 9, 2025
అట్లతద్దిని మీరు ఎలా జరుపుకుంటున్నారు?

ఒకప్పుడు అట్లతద్ది పర్వదినం ఉయ్యాలలు కట్టుకొని ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేసేవారు. అట్లతద్ది రోజున మహిళలు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఉపవాసం మొదలుపెట్టి, సాయంత్రం చంద్రోదయం తర్వాత అట్లు తిని ఉపవాసం విరమిస్తారు. మహిళలు ఒకచోట చేరి, పెద్ద చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని ఆడుకుంటూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడటం ఒక ఆనవాయితీ. అయితే రాను రాను ఈ ఆనవాయితీలు కనుమరుగవుతున్నాయి. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 29, 2025
రేపటి నుంచి యధావిధిగా పాఠశాలలు: డీఈవో

జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు గురువారం నుంచి యధావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మండల విద్యాశాఖ అధికారులకు పంపించారు. ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులు గమనించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలో శానిటేషన్ పనులు చేయించాలని సూచించారు.
News October 29, 2025
తుళ్లూరులో ఈ నెల 31 జాబ్ మేళా

అమరావతి రాజధాని ప్రాంతంలో 380కి పైగా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు CRDA కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో CRDA సౌజన్యంతో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరు స్కిల్ హబ్‌లో జాబ్ మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
News October 29, 2025
తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. పునరావాస కేంద్రాలలో కూడా పారిశుధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడా నీరు నిలువ ఉండరాదని అన్నారు. కాలువల్లో పూడిక తీసి డ్రైన్ లను క్లియర్ చేయాలని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.


