News June 22, 2024

అట్లూరులో ఇరువర్గాల దాడి

image

అట్లూరు మండల పరిధిలోని క్రాస్ రోడ్లో నివాసముండే నాగమునయ్య యాదవ్‌పై అదే గ్రామానికి చెందిన రెడ్డయ్య తన వర్గంతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో నాగమునయ్య తలకి గాయమైంది. వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Similar News

News March 2, 2026

పుష్పగిరిలో కనపడని యువకుల ఆచూకీ

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆదివారం సరదాగా ఈత కోసం దిగిన కొండాపురం మండలంలోని గండ్లూరుకు చెందిన శ్రీనాథ్ కడపకు చెందిన చైతన్య గల్లంతైన విషయం తెలిసిందే. వారికోసం పోలీసులు, బంధువులు గజ ఈతగాళ్ల సహాయంతో వెతుకులాట ఆరంభించారు. సోమవారం ఉదయం 9 వరకు వారి ఆచూకీ కనిపించలేదు. దాంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అనుముకున్నాయి. వీరు కడప నగరంలో ఎంబీఏ చదువుతున్నారు.

News March 2, 2026

కడప జిల్లాలో గత నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఎంతంటే.!

image

జిల్లాలో గత నెలలో 5,329 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ప్రభుత్వానికి రూ.20.28 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం రూ.కోట్లలో ఇలా ఉంది. ఏప్రిల్-5274-20.86, మే-6461-22.98, జూన్-6382-22.12, జులై-6673-25.51, ఆగస్ట్-5486-21.91, సెప్టెంబర్-5988-23.81, అక్టోబర్-5988-21.73, నవంబర్-5527-22.67, డిసెంబర్-5907-23.35, జనవరిలో 5898 – రూ.26.45 కోట్లు వచ్చింది.

News March 1, 2026

వల్లూరు: చంద్రగ్రహణం సందర్భంగా పుష్పగిరి ఆలయం మూసివేత

image

వల్లూరు (M) పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల మూడో తేదీన ఉదయం 6 గంటల నుంచి నాలుగో తేదీ ఉదయం ఏడున్నర వరకు తలుపులు మూసివేసి ఉంటుందని దేవాలయ ఈవో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహ వచనం స్వామివారికి విశేష అభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.