News April 16, 2025
అట్లూరు: ఈతకు వెళ్లి బాలిక మృతి

అట్లూరు మండలం కమలకురులో ఈతకు వెళ్లి 15 ఏళ్ల తేజ మృతి చెందిన విషయం తెలిసిందే. తేజ నడుముకు కట్టుకున్న ప్లాస్టిక్ వస్తువు జారిపోవడంతో నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలిక తండ్రి జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. పాప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 16, 2025
రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం: కలెక్టర్

రెవెన్యూ అధికారులు అన్ని రకాల ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని సభా భవనంలో వివిధ రెవెన్యూ అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం అన్నారు. అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని, మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు.
News April 15, 2025
కడప: బిల్టప్ సర్కిల్‌లో దారుణ హత్య

కడప నగరంలోని బిల్టప్ సర్కిల్‌లో ఇవాళ దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సాదిక్ అనే రవీంద్రనగర్‌కు చెందిన యువకుడు తన వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వచ్చినప్పుడు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన మీద మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 15, 2025
ఉమ్మడి కడప జిల్లాలో 106 పోస్టులు

ఉమ్మడి కడప జిల్లాలో 106 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 57 SGT(ప్రాథమిక స్థాయి), 49 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.