News May 5, 2024

అడ్డగూడూరు: పిడుగుపాటుకు ఒకరి మృతి

image

పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్పలపల్లి బాలమల్లు మేత కోసం పాడి గేదెను తన వ్యవసాయ బావి వద్దకు తోలుకెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో ప్రారంభమై వర్షం పడుతుండడంతో ఊరు ప్రక్కనే ఉన్న తన దొడ్డిలో ఆగగా పిడుగు పడి మృతి చెందాడు.

Similar News

News July 11, 2025

NLG: ఫెయిలైన అభ్యర్థులకు మరో అవకాశం

image

టీటీసీ కోర్సు పూర్తిచేసినవారు, గతంలో పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థుల కోసం ఆగస్టు 3న (ఆదివారం) థియరీ పరీక్ష జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు డీఈవో బిక్షపతి తెలిపారు. ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లతో గంట ముందుగా హాజరుకావాలని సూచించారు.

News July 11, 2025

NLG: సంబురంగా మహిళాశక్తి సంబరాలు

image

జిల్లాలో మహిళా శక్తి సంబరాలు సంబురంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. 12 నుంచి 18 వరకు నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ పంపుల నిర్వహణ, చేపలు, పెరటి కోళ్ల పెంపకం, కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, పాల డెయిరీ ఏర్పాట్లను ప్రోత్సహిస్తూ మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.

News July 11, 2025

NLG: పంతుళ్ల పరేషాన్.. బడికి డుమ్మా ఇక కుదరిదిక!

image

సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు FRS విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో FRS విధానం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది.