News August 21, 2025
అడ్డతీగల: ఇక్కడ విద్యార్థె టీచర్..?

అడ్డతీగల మండలం కొచ్చావారివీధి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు 10 రోజులుగా టీచర్ రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. ఇక్కడ పని చేసే ఒక్క టీచర్‌ను అడ్డతీగల డిప్యూటేషన్ పై వెళ్లడంతో పాఠాలు బోధించే వారు లేరని అంటున్నారు. 11 మంది విద్యార్థులు ఉన్నారని ప్రతీరోజు పాఠశాలకు వచ్చి పోతున్నారని తెలిపారు. తోటి విద్యార్థి కాసేపు పాఠాలు చెబుతున్నాడన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News August 21, 2025
కోనసీమను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలి: జేసీ

కోనసీమ జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా జ్యూట్ సంచులను ఉపయోగించాలని సూచించారు. రైతుబజార్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దాని వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. జిల్లాను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులంతా తమవంతు బాధ్యతగా ప్లాస్టిక్‌ను దూరం పెట్టాలని ఆమె పేర్కొన్నారు.
News August 21, 2025
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఎస్పీ మణికంఠ చందోలు, JC విద్యాధరి ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వారికి ఈవో ఆహ్వాన పత్రికలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కోరారు.
News August 21, 2025
ఖమ్మం: కేంద్ర ఆర్థిక మంత్రికి కలిసిన: డిప్యూటీ సీఎం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు పొరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలు, ఆర్థిక సహాయంపై డిప్యూటీ సీఎం వివరించారు.