News December 20, 2025
అడ్డతీగల: చికిత్స పొందుతూ ఉద్యోగి మృతి

అడ్డతీగల లేబర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.రామకృష్ణ (30) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం అతనికి చెస్ట్ పెయిన్ రావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. ఆయన గతంలో రంపచోడవరంలో కూడా పని చేశారు. ఆయన స్వగ్రామం రంపచోడవరం మండలం దేవరాతిగూడెం.
Similar News
News December 21, 2025
నేటి ముఖ్యాంశాలు

✭ కాంగ్రెస్ చేసిన తప్పులను సరిచేస్తున్నాం: మోదీ
✭ TG: అన్ని మతాలు మాకు సమానమే: సీఎం రేవంత్
✭ నేను రేవంత్‌తో ఫుట్‌బాల్ ఆడుతా: KTR
✭ AP: జగన్‌ది రాక్షసత్వం: చంద్రబాబు
✭ బెదిరించే నాయకులకు భయపడను.. కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా: పవన్
✭ గుడ్లు తింటే క్యాన్సర్ రాదు: FSSAI
✭ T20I వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన
News December 21, 2025
అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం

శబరిమల నుంచి HYD వస్తున్న అయ్యప్ప భక్తులకు పెను ప్రమాదం తప్పింది. కడప(D) గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, ఆరుగురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఆ లారీని ఢీకొట్టకపోయుంటే బస్సు లోయలో పడే అవకాశముండేదని, అదే జరిగి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగుండేదని భక్తులు వాపోయారు.
News December 21, 2025
ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం పెను ప్రమాదం తప్పింది. శబరిమల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు లోయల పడే అవకాశం ఉండేదనీ, ఒకవేళ ఇదే జరిగింటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని యాత్రికులు వాపోయారు.


