News January 3, 2026

అడ్డరోడ్డు ‘రెవెన్యూ’ పంచాయితీ!

image

అడ్డరోడ్డు కేంద్రంగా రాజకీయ రగడ చెలరేగింది. ఇక్కడ RDO కార్యాలయం ప్రారంభించడం వెనుక కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. హోంమంత్రి అనిత కృషితో డివిజన్ వచ్చిందని TDP సంబరాలు చేసుకోగా.. జనసేన MLA విజయ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ సాగుతోంది. ప్రారంభ కార్యక్రమానికి కూడా MLA హాజరు కాకపోవడంతో రాజకీయ చర్చకు దారితీసింది.

Similar News

News February 15, 2026

విజయవాడలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

విజయవాడలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 15, 2026

చెరకు పంట నరికేటప్పుడు ఇలా చేస్తే మేలు

image

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.

News February 15, 2026

భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

image

భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం గావించి, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ వేడుకలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం అర్చకులు నిర్వహించారు.