News January 29, 2025
అడ్డాకుల: అనుమానాస్పద స్థితిలో యువకుడి సూసైడ్

అడ్డాకుల మండలం రాచాల (నాగయ్యపల్లి)కి చెందిన యువకుడు గద్దెగూడెం చెన్నయ్య(24) అనుమానాస్పద స్థితిలో మంగళవారం రాత్రి ఉరేసుకుని మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత చెన్నయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.
News December 17, 2025
మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 17, 2025
MBNR: నేడు 122 సర్పంచ్‌లు, 914 వార్డులకు ఎన్నికలు

మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల నేపథ్యంలో మొత్తం 133 జీపీలు,1152 వార్డ్ సభ్యులకు గాను 10 సర్పంచ్ లు,231 వార్డ్‌లు ఏకగ్రీవం. జడ్చర్ల(M)లో ఒక జీరో నామినేషన్, 7 వార్డ్ సభ్యులకు జీరో నామినేషన్ పోను 122 సర్పంచ్‌లు, 914 వార్డ్ సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు ఏకగ్రీవంతో కలిపి 440 మంది అభ్యర్థులు, వార్డ్ సభ్యులు 2,584 మంది పోటీలో ఉన్నారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.


