News March 19, 2024
అడ్డాకుల: కుక్కలను కాల్చి చంపిన ముగ్గురి అరెస్ట్

అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కుక్కలను కాల్చి చంపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నడంతో గ్రామానికి చెందిన పలువురు ఈనెల 15న దాదాపు 20 కుక్కలను కాల్చి చంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నేడు నిందితులు నర్సింహారెడ్డి, తారిఖ్ అహ్మద్, మహమూద్ తాహీర్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News April 5, 2025
జడ్చర్ల MLAపై అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

జడ్చర్ల పట్టణంలోని నల్లకుంట చెరువులో ఉన్న 4 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, అతడి సోదరుడు దుష్యంత్ రెడ్డి కబ్జా చేశారని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారం చేశారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ మేరకు తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జడ్చర్ల PSలో సీఐ కమలాకర్‌కు ఫిర్యాదు చేశారు.
News April 5, 2025
మహబూబ్‌నగర్: ‘CM రేవంత్ రెడ్డికి THANKS’

DSC-2008 అభ్యర్థుల 15 సంవత్సరాల నిరీక్షణను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని DSC-2008 అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు మాలతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసినందుకు పాలాభిషేకం చేశారు. అనేక సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న తమకు సీఎం న్యాయం చేశారన్నారు. MBNR జిల్లా గండీడ్ మండల ఉపాధ్యాయులు ఉన్నారు.
News April 4, 2025
మహబూబ్‌నగర్: ఘనంగా వేడుకలు నిర్వహించాలి: బీజేపీ

మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా ఆఫీస్‌లో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 13 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, 14 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ, జనగణన, జమిలి ఎన్నికలు, రైతుల సమస్యలపై బూత్ కమిటీలు వేసి చర్చించాలని అన్నారు.