News July 8, 2025
అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి గోదావరి నది తీర ప్రాంతం వెంబడి 6 అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధికి టెండర్లను పిలవడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పర్యాటకరంగ, అడ్వెంచర్ టూరిజం ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. టెండర్ ప్రతిపాదనలపై ఆయన వారితో సమీక్షించి సూచనలు చేశారు.
Similar News
News July 8, 2025
కోనసీమ: ‘దోమల నిర్మూలనే మార్గం’

జాతీయ కీటకజనిత వ్యాధి నివారణలో భాగంగా జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వరరావు మంగళవారం అల్లవరం మండలం బెండమూర్లంక పీహెచ్‌సీని సందర్శించారు. ఫ్రైడే-డై డే కార్యక్రమాల పనితీరును ఆయన పరిశీలించారు. దోమల నిర్మూలన ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు అదుపులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సూర్య నగేశ్, సబ్ యూనిట్ అధికారి రామారావు పాల్గొన్నారు.
News July 8, 2025
తూ.గో జిల్లాలో “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”

తూ.గో జిల్లా ఎస్పీ డి. నరసింహాకిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు 100 గజాల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని పేర్కొన్నారు.
News July 8, 2025
బాలకార్మికులను సంరక్షించిన విజయవాడ RPF పోలీసులు

విజయవాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF)పోలీసులు ట్రైన్‌లో పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 9 మంది మైనర్ బాలురను మంగళవారం గుర్తించారు. ఈ మేరకు బాలలను పని కోసం తరలిస్తున్న నలుగురిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని RPF పోలీసులు చెప్పారు. విజయవాడ స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో వీరిని గుర్తించామని, ప్రస్తుతం బాలలను సంక్షేమ కమిటీకి తరలించామని RPF సిబ్బంది తెలిపారు.