News December 18, 2025

అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. ‘శాంతి’ బిల్లుకు LS ఆమోదం

image

‘అణు రంగం’లోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన ‘శాంతి(SHANTI)’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనిని దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక ‘మైల్ స్టోన్’ చట్టంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. దీంతో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అయితే ఈ బిల్లు పౌర అణు నష్టపరిహార చట్టం-2010లోని నిబంధనల్ని నీరుగార్చేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Similar News

News December 19, 2025

BELOPలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>BEL<<>> ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(BELOP)5 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. 30ఏళ్ల లోపు కలిగి, BE, B.Tech (ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, E&TC, మెకానికల్ ) ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://bel-india.in

News December 19, 2025

దివ్యాంగులకు త్రీవీలర్స్, ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌కార్డులు: డోలా

image

AP: దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పనకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. 21 సెంచరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ద్వారా పోటీ పరీక్షలతోపాటు డిజిటల్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ట్రైనింగ్ అందిస్తామన్నారు. దివ్యాంగులకు ఫ్రీగా త్రీవీలర్స్ ఇస్తామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

News December 19, 2025

జెనోమిక్స్.. రూ.10వేల టెస్టు రూ.వెయ్యికే

image

వైద్యరంగంలో అతిపెద్ద విప్లవానికి రిలయన్స్ సిద్ధమవుతోంది. క్యాన్సర్ సహా భవిష్యత్తులో వచ్చే రోగాలను ముందే గుర్తించేందుకు వీలుగా ₹10వేల విలువైన జెనోమిక్స్ టెస్టును ₹వెయ్యికే అందించాలని యోచిస్తోంది. దీనివల్ల ముందుగానే జాగ్రత్త పడటానికి వీలవుతుంది. రక్తం/లాలాజలం/శరీరంలోని టిష్యూని ఉపయోగించి ఈ పరీక్ష చేస్తారు. జెనోమిక్స్‌తో సమాజంపై తమ ముద్ర వేస్తామని సంస్థ సీనియర్ అధికారి నీలేశ్ వెల్లడించారు.