News November 8, 2025

అణ్వాయుధ దేశంగా పాక్.. ఇందిర నిర్ణయమే కారణం: మాజీ CIA

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం వల్లే పాక్ అణ్వాయుధ దేశంగా మారిందని US CIA మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో వెల్లడించారు. ‘భారత్, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి ఇస్లామాబాద్‌ కహుతా అణు తయారీ కేంద్రంపై దాడికి సిద్ధమయ్యాయి. దీనికి అప్పటి ప్రధాని ఇందిర అంగీకరించలేదు. ఈ దాడి జరిగి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి. పాక్ అణ్వాయుధాలు తయారు చేసేది భారత్‌‌ను ఎదుర్కొనేందుకే’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Similar News

News November 8, 2025

మాలిలో ఐదుగురు ఇండియన్ కార్మికుల కిడ్నాప్

image

ఆఫ్రికన్ కంట్రీ మాలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు ఇండియన్ కార్మికుల్ని దుండగులు కిడ్నాప్ చేశారు. వెస్ట్రన్ మాలిలోని కోబ్రీలో విద్యుదీకరణ ప్రాజెక్టు పనుల్లో వారుండగా ఇది జరిగినట్లు భద్రతావర్గాలు AFPకి తెలిపాయి. మిగతా కార్మికుల్ని రాజధాని బమాకోకు తరలించారు. అల్‌ఖైదాతో సంబంధాలున్న JNIM జిహాదీలు ఇటీవల ముగ్గురిని అపహరించి $50Mలు తీసుకొని విడిచిపెట్టారు. తాజా ఘటనపై ఇంకా ఏ సంస్థా స్పందించలేదు.

News November 8, 2025

ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

image

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.

News November 8, 2025

పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌ 6 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://www.andhrauniversity.edu.in/