News February 28, 2025
అతిసార ఘటనపై స్పందించిన మంత్రి నారాయణ

ఆత్మకూరులోని నీలితొట్ల వీధి కాలనీలో అతి సార ప్రబలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నీలితొట్ల వీధిలో యుద్ధప్రాతిపదికన మురికి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News July 9, 2025
ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్‌కు ఉత్కృష్ట అవార్డు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్‌కు ప్రతిష్ఠాత్మక ఉత్కృష్ట అవార్డు దక్కింది. ఆయన డిపార్టుమెంటులో అందించిన అత్యుత్తమ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. కమిషనరేట్ పరిధిలోని సీఐ ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సీపీ సన్ ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. షుకూర్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
News July 9, 2025
NZB: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం.. ASI భార్య మృతి

NZB కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో NZB పోలీస్ ఇంటలిజెన్స్‌లో పనిచేస్తున్న ASI భీమారావు భార్య భవాని మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారి బైక్‌కు కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న భవాని మృతి చెందారు.
News July 9, 2025
రేపట్నుంచే మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ

AP: మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధుల విడుదలకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.