News June 21, 2024

అతిసార వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడ అతిసార వ్యాధి ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు. శుక్రవారం నాడు జరిగిన రాష్ట్రవ్యాప్త కాన్ఫరెన్స్‌లో భాగంగా ఢిల్లీ రావు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలింది అన్న ప్రచారం ఉండకూడదని అన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు.

Similar News

News October 6, 2024

కృష్ణా: దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లుపై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.

News October 6, 2024

కృష్ణా జిల్లాలోృ 99% మేర ఈ-క్రాప్ నమోదు పూర్తి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో 99% మేర ఈ-క్రాప్ నమోదు, 89% మేర ఈ కేవైసీ పూర్తయినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటలు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుని ఈ కేవైసీ చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి వీలవుతుందన్నారు.

News October 6, 2024

నేడు మచిలీపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

image

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు మచిలీపట్నం నోబుల్ కాలేజ్‌లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు హీరో హీరోయిన్ సుహాస్, సంగీర్తనతోపాటు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్, చిత్ర యూనిట్ మొత్తం తరలి రానుంది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు.